Home > తెలంగాణ > రాజయ్య - కడియం షేక్ హ్యాండ్.. ఆ తర్వాత..

రాజయ్య - కడియం షేక్ హ్యాండ్.. ఆ తర్వాత..

రాజయ్య - కడియం షేక్ హ్యాండ్.. ఆ తర్వాత..
X

స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గులాబీ బాస్ ఈ సారి రాజయ్యకు కాకుండా కడియంకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కడియంకు టికెట్కు ఇవ్వడంతో రాజయ్య గుర్రుగా ఉన్నారు.

ఈ క్రమంలో నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే స్టేజీపై ఇద్దరూ కలుసుకున్నారు. పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పునఃప్రతిష్ట కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఒకరికొకరు ఎదురుపడడంతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కూర్చున్నారు. అయితే రాజయ్య మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఇద్దరు షేక్ ఇచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Updated : 4 Sept 2023 7:10 PM IST
Tags:    
Next Story
Share it
Top