Home > తెలంగాణ > కేటీఆర్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ.. కడియంతో వివాదంపై వివరణ

కేటీఆర్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ.. కడియంతో వివాదంపై వివరణ

కేటీఆర్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ.. కడియంతో వివాదంపై వివరణ
X

స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ లొల్లి ప్రగతిభవన్కు చేరింది. గత కొన్ని రోజులుగా రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతిభవన్ నుంచి పిలుపొచ్చింది. దీంతో హుటాహుటిన ప్రగతిభవన్ వెళ్లిన రాజయ్య.. మంత్రి కేటీఆర్తో సమావేశమై కడియంతో రాజకీయ వివాదం గురించి వివరించారు.

తాను చెప్పిన అంశాలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు రాజయ్య చెప్పారు. ‘‘నా పని నన్ను చూసుకోమని చెప్పారు. కడియం పవర్ స్టేషన్గా మారి.. గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. కడియం కులంపై గతంలో మోత్కుపల్లి నర్సింలు, మందకృష్ణ మాదిగ వంటి నేతలు చెప్పిన మాటలనే ప్రస్తావించా. అంతేతప్ప ఎటువంటి వ్యక్తిగత దూషణలు చేయలేదు. సర్పంచ్ నవ్య వివాదంపై హైకమాండ్కు క్లారిటీ ఉంది. నవ్య తప్పుడు కేసులు పెట్టినట్లు విచారణలో తేలింది’’ అని రాజయ్య వివరించారు.

స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య - ఎమ్మెల్సీ కడియం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా పరిస్థితి ఉంది. రాజయ్య.. కడియం శ్రీహరిపై విమర్శలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి ఎస్సీ కాదని.. ఆయన తల్లి బీసీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కడియం ఒక బ్లాక్ మెయిలర్ అని.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

రాజయ్య వ్యాఖ్యలకు కడియం శ్రీహరి సైతం అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి ఎస్సీ, తల్లి బీసీ అని.. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని సుప్రీం చెప్పినట్లు కడియం స్పష్టం చేశారు. రాజయ్య చేసిన ఆరోపణలను వారంలోగా నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీరి గొడవతో నియోజకవర్గంలో పార్టీ పరువు పోతుండడంతో అధిష్టానం కన్నెర్రజేసినట్లు సమాచారం.

డియం శ్రీహరి అంశంపై చర్చించే అవకాశం ఉంది.

ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కూతురిని ఎన్నికల బరిలో నిలిపేందుకు కడియం సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇరువురు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వ్యక్తిగత దూషణల దాకా వెళ్తుండడం గమానర్హం. ఈ ఇద్దరి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది.

MLA Rajaiah meets minister ktr at Pragathi Bhavan

Minister KTR,MLA Rajaiah,Pragathi Bhavan,thatikonda rajaiah,kadiyam srihari,station ghanpur,

Updated : 11 July 2023 10:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top