Home > తెలంగాణ > Kalyanalakshmi : రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలి.. సబితా ఇంద్రారెడ్డి

Kalyanalakshmi : రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలి.. సబితా ఇంద్రారెడ్డి

Kalyanalakshmi : రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలి.. సబితా ఇంద్రారెడ్డి
X

బీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కొత్తగా ఇచ్చే కల్యాణ లక్ష్మి పథకానికి రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలని సూచించారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి, బడంగ్​పేట పురపాలక సంఘాల్లో ఎన్నికల ముందు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లబ్దిదారులకు అందజేశారు. జల్​పల్లి పరిధిలో 77 మందికి, బడంగ్​పేట పురపాలక సంఘం పరిధిలో 55 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు.

నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు.పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే కేసీఆర్‌ ఈ పథకాలను ప్రవేశపెట్టారని, దేశంలో ఇలాంటి పథకాలు మరెక్కడా లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం(Gold) ఇచ్చే ప్రక్రియ తొందరగా ప్రారంభించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. గత ప్రభుత్వం తరహాలోనే సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయ, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికి అమలు చేయాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.




Updated : 5 Jan 2024 2:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top