Home > తెలంగాణ > Goreti Venkanna : అంతా అధికారుల వల్లే.. గోరేటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Goreti Venkanna : అంతా అధికారుల వల్లే.. గోరేటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Goreti Venkanna  : అంతా అధికారుల వల్లే.. గోరేటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు
X

రైతు బంధుపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వందల ఎకరాలు ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, నాయకులకు రైతుబంధు ఇవ్వొదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే తాను చెప్పానని.. ఇప్పుడూ చెబుతున్నానని అన్నారు. పది ఎకరాల లోపు ఉన్న వారికే రైతు బంధు బంధు ఇవ్వాలని.. 10 ఎకరాలకు మించి ఉంటే ఇవ్వొద్దని స్పష్టం చేశారు. నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులని ప్రశంసించారు. పేదలకు నీళ్లు, రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రదిష్ఠ పాలుకావడానికి అధికారులే కారణమని వెంకన్న ఆరోపించారు. అధికారులు 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదానం చేశారన్నారు. అదేవిధంగా ఇష్టారీతిగా వ్యవహరించి కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టారని.. హరగోపాల్ మీద కేసు పెట్టారని మండిపడ్డారు. నెహ్రూ వారసులారా మీరు ఆ తప్పులు చేయొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరేటి సూచించారు.


Updated : 17 Dec 2023 8:03 AM IST
Tags:    
Next Story
Share it
Top