Home > తెలంగాణ > MLC Kavita : ఆ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయం సరైనదే: ఎమ్మెల్సీ కవిత

MLC Kavita : ఆ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయం సరైనదే: ఎమ్మెల్సీ కవిత

MLC Kavita  : ఆ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయం సరైనదే: ఎమ్మెల్సీ కవిత
X

బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఈ మేరకు కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుంది. న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి ఉదాహరణ అని కవిత అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరైనవి కావని కవిత గతంలోనే చెప్పారు. పోయిన ఏడాది మే నెలలో అప్పటి సుప్రీ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు కవిత లేఖ రాశారు. గుజరాత్ ప్రభుత్వం.. బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు సరైనవి కావని, వాటిని రద్దు చేయాలని కవిత అప్పుడే లేఖలో చెప్పారు.





Updated : 8 Jan 2024 3:36 PM IST
Tags:    
Next Story
Share it
Top