కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీయంగా మారింది: ఎమ్మెల్సీ కవిత
X
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని కవిత విమర్శించారు. పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ లో పది శాతం కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రజావాణి వారి చెవిన పడటం లేదు, కేవలం ఢిల్లీ వాణి మాత్రమే వింటున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాన్ని నిందించడం కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయని, తెలంగాణ ఏఐసీసీకి ఏటీయంగా మారిపోయిందని కవిత ఆరోపించారు.
మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి గతం ప్రభుత్వంలో ఉన్న బస్సులను వాడుతున్నారని అన్నారు. మహాలక్షీ స్కీంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇంతవరకు దాని ఊసుతీయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మరిచిందని కవిత విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 1.39 లక్షల మంది మహిళలకు ఇస్తానన్న రూ.2,500 పెన్షన్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
MLC Kavitha alleged congress,assembly budget sessions, MLC Kavitha,MLC Kavitha Sensational comments on cm revanth reddy,MLC Kavitha Sensational comments on congress, MLC Kavitha on Telangana government,Telangana has become an ATM for the Congress