Home > తెలంగాణ > ఓటు వేసిన పలువురు రాజకీయ ప్రముఖులు

ఓటు వేసిన పలువురు రాజకీయ ప్రముఖులు

ఓటు వేసిన పలువురు రాజకీయ ప్రముఖులు
X

అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటల లోపే పలువురు రాజకీయ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. బీఆర్ఎస్

ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యూత్‌ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. బర్కత్ పురాలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు అత్యంత విలువైనదే కాక పవిత్రమైనదని ఆయన అన్నారు. ప్రజలంతా తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని నారాయణపురంలో ఆయన ఓటు వేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటు వేశారు. మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని 102 పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఓటు వేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మాదాపూర్ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ స్టేషన్లో సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated : 30 Nov 2023 8:16 AM IST
Tags:    
Next Story
Share it
Top