MLC KAVITHA: రాహుల్ గాంధీ బీసీల గురించి ఇన్నాళ్లు ఎందుకు మాట్లడలేదు - ఎమ్మెల్సీ కవిత
X
60 ఏండ్లు అధికారంలో ఉండి వెనుకబడిన వర్గాలకు ఏం చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ జనగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కవిత చెప్పారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల వారు ఎంత మంది ఉన్నారో గుర్తించాలని డిమాండ్ చేశారు.
బీసీ మంత్రిత్వ శాఖ గురించి బీఆర్ఎస్ ఎన్నిసార్లు అడిగినా కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించలేదని కవిత మండిపడ్డారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులెవరూ ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. దేశంలో ఎంత మంది బీసీలు ఉన్నారో లెక్క తేల్చాలన్న కవిత.. మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళల కోటా తేల్చాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా గారు, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది. pic.twitter.com/299puw93Ht
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 10, 2023