Home > తెలంగాణ > MLC KAVITHA: అబద్దాలు ఆడటంలో బీజేపీ ఆరితేరింది : కవిత

MLC KAVITHA: అబద్దాలు ఆడటంలో బీజేపీ ఆరితేరింది : కవిత

MLC KAVITHA: అబద్దాలు ఆడటంలో బీజేపీ ఆరితేరింది : కవిత
X

సంపదన సృష్టిస్తూ, పెంచిన సంపదను పేదలకు పంచుతూ.. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్.. పారిశ్రామిక రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, పాడి పంటలకు అంతే ప్రధాన్యం ఇచ్చారని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ క్రియేట్ చేసిన మోడల్ ను దేశం అంతా వెతుకుతుంది, కావాలంటుందని అన్నారు. ఇన్ని స్కీంలు అమలు చేస్తున్నా, రాష్ట్రం ఇంకా సుసంపన్నంగా ఉండానికి గల కారణాన్ని పక్క రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ ను అడిగి తెలుసుకుంటున్నారని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ 119 నియోజక వర్గాల్లో డిపాజిట్లు కోల్పోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి బీజేపీ పాలన నేర్చుకుంటుందని చెప్పారు. పీఎం మోదీ.. తెలంగాణ పథకాలను స్పూర్తిగా తీసుకుని, దేశమంతా అమలు చేస్తున్నారని అన్నారు. బీజేపీకి కమిట్మెంట్ ఉంటే.. రాష్ట్రం కోసం పనిచేయాలే కానీ.. ఇలా అనవసరపు అడ్డంకులు కలిగించొద్దని మండిపడ్డారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ అయిన సందర్భంగా సంతోష్ వ్యక్తం చేశారు కవిత. ఇది తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశాన్ని విభిన్నంగా తీర్చిదిద్దే మేనిఫెస్టో అని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయగానే.. కాంగ్రెస్, బీజేపీలో వణుకు మొదలయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి చిత్తు కాగితంగా పోల్చడాన్ని కవిత తప్పుబట్టారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలే టిష్యూ పేపర్లతో సమానం అన్ని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తామనే గ్యారెంటీ లేని కాంగ్రెస్, బీఆర్ఎస్ ను విమర్శించడానికి అనర్హులు అని తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరి మేనిఫెస్టో చిత్తు కాగితమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

Updated : 16 Oct 2023 8:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top