Home > తెలంగాణ > ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డికి కవిత కౌంటర్

ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డికి కవిత కౌంటర్

ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డికి కవిత కౌంటర్
X

గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్య ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నది కాంగ్రెస్ పార్టీనేనని కవిత మండిపడ్డారు.

బతుకమ్మ చేస్తాం, బాధను పంచుకుంటామని కవిత అన్నారు. బతుకమ్మ పండుగను కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డ ఆత్మహత్యపై రాజకీయం చేయడమే కాంగ్రెస్ విధానమా? నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీయేనని కవిత ఆరోపించారు. నోటిఫికేషన్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు.

కాంగ్రెస్ కుట్రలను బద్దలుకొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కవిత అన్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా? పరీక్ష వాయిదా వేయాలని ట్వీట్ చేయలేదా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్న కవిత.. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు కాంగ్రెస్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అని కవిత ట్వీట్ చేశారు.


Updated : 14 Oct 2023 11:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top