Home > తెలంగాణ > అమ్మలోని మొదటి అక్షరం..నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ”..ఎమ్మెల్సీ కవిత

అమ్మలోని మొదటి అక్షరం..నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ”..ఎమ్మెల్సీ కవిత

అమ్మలోని మొదటి అక్షరం..నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ”..ఎమ్మెల్సీ కవిత
X

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏ ఇళ్లు చూసినా అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల సందడిత కళకళలాడుతోంది.

శ్రావణ పౌర్ణమిన తోడబుట్టిన అన్నాతమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని రాఖీలను కట్టి అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. సోదరుల నోరు తీపి చేసి సంతోషంగా ఉండాలంటూ మనసారా దీవిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు అందరూ రాఖీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడు మినిస్టర్ కేటీఆర్‎ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ కవిత ఓ ఎమోషన్ పోస్ట్ ‎ను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజు అన్నకు రాఖీ కట్టి దీవెనలు తీసుకుంటారు కవిత. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ తన కుటుంబంతో సహా అమెరికా పర్యటనలో ఉండటంతో రాఖీ కట్టేందుకు కవితకు కుదరలేదు. అందుకే అన్నను గుర్తు చేసుకుంటూ ట్విటర్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా 'అన్న' కేటీఆర్ అని ఆమె అన్నారు. తన అన్నతో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.

ఇక కవిత సోదర సమానమైన రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు రాఖీ కట్టారు. తన సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన కవిత సంతోష్ కుమార్‎కు రాఖీ కట్టారు. ఈ క్రమంలో రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎంపీ సంతోష్‌ తన ట్విట్టర్‌‏లో షేర్ చేశారు.



Updated : 31 Aug 2023 2:18 PM IST
Tags:    
Next Story
Share it
Top