Home > తెలంగాణ > MLC kavitha: అర్వింద్.. మీ ఇంట్లో వాళ్లను ఇలా అంటే పడతారా : కవిత

MLC kavitha: అర్వింద్.. మీ ఇంట్లో వాళ్లను ఇలా అంటే పడతారా : కవిత

MLC kavitha: అర్వింద్.. మీ ఇంట్లో వాళ్లను ఇలా అంటే పడతారా : కవిత
X

నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తనపై అర్వింద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని స్థానిక మహిళలు వచ్చి చెప్పారని.. అదే మాటలు ఆయన ఇంట్లో వాళ్లను అంటే పడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత హుందాగా ఉన్నానని.. కానీ అర్వింద్ మాత్రం అధికార గర్వంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆంధ్ర పాలకులు కూడా అర్వింద్ లాగా నీచంగా మాట్లాడలేదని కవిత అన్నారు. సమస్యలపై మాట్లాడకుండా.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘ఇదేం సంస్కారం అరవింద్! మీ లాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైం వచ్చేసింది. మేము మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమయంలో.. నిజామాబాద్ ఎంపీ మాట్లాడిన మాటలు మహిళలను రాజకీయాల్లోకి రాకుండా కట్టడి చేసేలా ఉన్నాయి’’ అని కవిత ట్వీట్ చేశారు.

Updated : 18 Oct 2023 10:26 AM IST
Tags:    
Next Story
Share it
Top