Home > తెలంగాణ > కేసీఆర్ చెప్పింది చేశారు.. గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత..

కేసీఆర్ చెప్పింది చేశారు.. గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత..

కేసీఆర్ చెప్పింది చేశారు.. గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత..
X

సీఎం కేసీఆర్ నిర్ణయాలతో గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా పుంజుకునేందుకు బీఆర్ఎస్ సర్కారు పలు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆర్మూర్ లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చెప్పింది చెప్పనట్లు చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపుతారని చెప్పారు. ఎన్నికల వేళలో ఇతర పార్టీల వారు వచ్చి చాలా మాటలు చెబుతారని వాటిని నమ్మి అటువైపు చూస్తే ఇన్నాళ్లు చేసిందంతా వృధా అవుతుందని అన్నారు.

తెలంగాణ రాక‌ముందు, కేసీఆర్ సీఎం కాక‌ముందు ప‌రిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్ర‌జ‌ల‌ు గ‌మ‌నించాల‌ని క‌విత కోరారు. గంగపుత్రులు చాలా పేదరికంతో ఉండేవారని కానీ ఇప్పుడు వారి జీవితాల్లో మార్పు వచ్చిందని అన్నారు. గతంలో 2000 మత్స్య సంఘాలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 6000ల‌కు పెరిగిందని చెప్పారు. చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను వేస్తున్నదని, గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్న చెరువులను మత్స్య శాఖకు బదిలీ చేశామని గుర్తు చేశారు.

మిషన్ కాకతీయ కార్యక్రమం కింద చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, అందుకే చేపల పెంపకం పెరిగిందని క‌విత చెప్పారు. గంగపుత్రుల గురించి అసెంబ్లీలో గతంలో ఏ సీఎం మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే గంగపుత్రుల సంక్షేమం గురించి సభలో మాట్లాడారని గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ గంగపుత్ర బిడ్డకు సభ్యత్వం ఇవ్వడంతో పాటు మత్య్సకారులకు ప్రభుత్వం రూ. 6 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందని కవిత స్పష్టంచేశారు.


Updated : 23 Nov 2023 10:22 PM IST
Tags:    
Next Story
Share it
Top