ఫ్యామిలీలో విబేధాలు.. కవిత వేరు కుంపటి..?
X
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి కవిత హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. అయితే ఈ పరాజయం కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చుపెట్టినట్లు సమాచారం. అంతేకాదు.. కవితకు కేటీఆర్కు పడటంలేదని, వారి మధ్య గొడవలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల పోటీ చేసే విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో విభేధాలు మరింత తీవ్రమయ్యాయన్న వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం. గతంలో పోటీ చేసిన నిజామాబాద్ లేదా మెదక్ నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన మానుకోవాలని కేసీఆర్ కవితతో చెప్పినట్లు సమాచారం. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తు కోసం తన దారి తాను చూసుకోవాలని కవిత ఫిక్సైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో కవిత వేరు కుంపటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇకపై భారత జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడైనట్లుతెలుస్తోంది. ఇటీవల కవిత నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎక్కడా కేసీఆర్ ఫొటోగానీ, బీఆర్ఎస్ పార్టీ సింబల్ కాని కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. కవిత వేరుకుంపటికి సంబంధించి మరింత సమాచారం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.