MLC Kavitha : మీ పాపాలకు ప్రాయోశ్చిత్తం ఉండదు.. కాంగ్రెస్ పై కవిత ఫైర్
X
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మొన్న కేసీఆర్ ను వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ లో చెలరేగిన విరాట్ కోహ్లీతో పోల్చిన కవితకు టీ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు కౌంటర్ అన్నట్లుగా గురువారం సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడిన అంశంపై కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా? ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తుకు రాకపోవడం బాధాకరం! ఈ గడ్డమీద జోడో యాత్రలు చేసి ఒక్క సారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మొకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 17, 2023
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా?
పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ… pic.twitter.com/N4bni4z4qU
ఇక అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ట్విటర్ లో కవిత ( MLC Kavitha ) తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అంటే... రేటెంతరెడ్డి సీట్లు అమ్మే దుకాణం తెరిచారు. నియమకాలు, ప్రాజెక్టులపై కేసులు వేస్తూ నంగనాచిలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. రంగులు మార్చే కాంగ్రెస్ పార్టీ మనకెందుకు ? తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం’’ అని ఎక్స్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు.