Home > తెలంగాణ > సోనియా జీ..ఆ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు..? - ఎమ్మెల్సీ కవిత

సోనియా జీ..ఆ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు..? - ఎమ్మెల్సీ కవిత

సోనియా జీ..ఆ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు..? - ఎమ్మెల్సీ కవిత
X

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియా గాంధీ రాసిన లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆ లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఈ అంశాన్ని లేఖలో ఎందురు రాయలేదని కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు.

సోనియా రాసిన లేఖతో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని కవిత అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కీలకమైన జాతీయ అంశం కాదా అని నిలదీశారు. సోనియా వైఖరితో మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు.

ఈ నెల 18 నంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండా సెషన్ ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎజెండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెషన్ ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని సూచించారు.

Updated : 6 Sept 2023 6:29 PM IST
Tags:    
Next Story
Share it
Top