కేసీఆర్ పేరును ‘కాళేశ్వరం చంద్రశేఖరరావు’గా మార్చాలి
X
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరథ ప్రయత్నం. అడ్డంకులను జయించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్ పేరును ‘కాళేశ్వరం చంద్రశేఖరరావు’గా మార్చాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన.. సాగునీటి దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని.. అందుకే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి.. కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలని కోరారు.
‘ఆ శివుడి తలపై గంగ, తెలంగాణ శిరస్సుపై కాళేశ్వర గంగ’ అని కవిత వ్యాఖ్యానించారు. 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు.. కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ నుంచి మంత్రిగా చేసిన వ్యక్తి.. ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారో చూపాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతా అవినీతి అని.. కాలువలు తవ్వి కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్సెస్ సొంతమని కవిత అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగిన సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారితో కలిసి పాల్గొనడం జరిగింది #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/WIU4KsnEJi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 7, 2023