గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత...వీడియో వైరల్
X
బతుకమ్మ సంబరాలు దగ్గరొచ్చేస్తున్న క్రమంలో భారత్ జాగృతి సన్నాహాలు మొదలు పెట్టేసింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా హుషారైన బతుకమ్మ పాటలను అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను కవిత విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. 'పొదల పొదల గడ్ల నడుమ నాగమల్లే దారిలో' అంటూ పాడిన ఈ పాటను కవిత ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు కూడా భారత్ జాగృతి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జాగృతి యాప్‌లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ఇంకా
ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరించేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కేటాయించారు. +91 8985699999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును కల్వకుంట్ల కవిత అభినందించారు
Rejoicing the beautiful #Bathukamma journey with our popular and celebrated folk singers! @BharatJagruthi has a repository of Bathukamma Songs, with great efforts to save the native language and tunes we collected songs from our older generation. If you think that we may have… pic.twitter.com/KhH70p8A7a
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 14, 2023