Home > తెలంగాణ > మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మళ్లీ దీక్ష చేస్తా - ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మళ్లీ దీక్ష చేస్తా - ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మళ్లీ దీక్ష చేస్తా - ఎమ్మెల్సీ కవిత
X

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ సర్కారుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. 14 ఏండ్లుగా మోడీ సర్కారు మహిళా బిల్లు ఎందుకు ఆమోదించడం లేదని ఆమె ప్రశ్నించారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిసెంబర్లో మళ్లీ దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా పలువురు మహిళా నేతలను ఆహ్వానిస్తానని చెప్పారు.

కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదన్న ఆమె.. దేశంలోని మహిళలంతా చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు. ఉమెన్ రిజర్వేషన్ కోసం అంబేడ్కర్ సైతం కొట్లాడిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. మహిళలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా అని కవిత ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ నాయకులను కవిత హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కనివారందరికీ సీఎం కేసీఆర్ తగిన ప్రాధాన్యం కల్పిస్తారని స్పష్టం చేశారు.




Updated : 23 Aug 2023 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top