కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్..
X
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల ట్వట్టర్ అకౌంట్లపై పడ్డారు. వరుసగా నేతల ట్విట్టర్ అకౌంట్ల హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్కు గురైనట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అటు గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. డీపీలు మార్చుతూ, సంబంధం లేని పోస్టులు పెట్టారు. దీనిపై రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రిత మంత్రి దామోదర రాజనరసింహా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన పేజీలో ఇతర పార్టీలకు చెందిన పోస్టులను పెట్టారు.