Home > తెలంగాణ > కాంగ్రెస్ పార్టీకి అధికారకాంక్ష మాత్రమే ఉంది - ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీకి అధికారకాంక్ష మాత్రమే ఉంది - ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీకి అధికారకాంక్ష మాత్రమే ఉంది - ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ది పేగు బంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో కవిత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీకి పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. ఆ పార్టీకి అధికారమిచ్చి పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు.

ఎన్నికలు సమయంలో ఇతర పార్టీల వాళ్లు అది చేస్తాం ఇది ఇస్తామని మాయమాటలు చెప్పి పోతారని ఆ తర్వాత ప్రజల గురించి పట్టించుకోరని కవిత విమర్శించారు. 55 ఏండ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయని కాంగ్రెస్ పార్టీ.. రూ. 200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు. గత పదేండ్లలో సీఎం కేసీఆర్ చెప్పింది చేసి చూపించారని కవిత స్పష్టం చేశారు.

రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు. కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని కవిత చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ఐదేండ్లలో పింఛను రూ.5 వేలు అవుతుందని, ఎన్నికలు పూర్తైన వెంటనే రూ.3 వేలకు పెరుగుతుందని అన్నారు. బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు కవిత ప్రకటించారు.

Updated : 19 Nov 2023 1:55 PM IST
Tags:    
Next Story
Share it
Top