Home > తెలంగాణ > జయశంకర్ సార్ మా కుటుంబ సభ్యుడు.. ఎమ్మెల్సీ కవిత

జయశంకర్ సార్ మా కుటుంబ సభ్యుడు.. ఎమ్మెల్సీ కవిత

జయశంకర్ సార్ మా కుటుంబ సభ్యుడు.. ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు.. ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్‌ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ , తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని చెప్పారు. ఆచార్య జయశంకర్‌ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని రాఘవేంద్ర నగర్‌లో నిర్మించిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి ఆ‌ మహనీయుడికి ఘన‌ నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రొ .జయశంకర్ సార్ తమ కుటుంబ సభ్యుడనీ.. ఆయన నుండి నేను అనేక అంశాలు నేర్చుకున్నానని అన్నారు. ప్రతి ఆగస్టు 6 నాడు జాగృతి వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నామని.. ఈ రోజు కూడా జిల్లాల వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. మంచి వ్యక్తులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని.. అలాగే జయశంకర్ గారు పుట్టినప్పుడు కూడా ఆమె సంతోషించి ఉంటుందన్నారు. ప్రొ.జయశంకర్ పుట్టిన రోజు మేడ్చల్ లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జయశంకర్ సార్.. తన చిన్నతనం నుండి తెలంగాణ ను ఆంధ్ర లో కలపకండి అని 1948 నుండి కోట్లాడిండని కవిత అన్నారు. "అందరికి అండగా ఉండి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఇచ్చిండు. అనేక సందర్భాలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిండు. ఆనాడు తెలంగాణ గురించి కోట్లాడి ముందుకు కదిలిండు. తెలంగాణ ను సాదించేందుకు కేసీఆర్ ముందుకు వస్తే వారికి తోడు లెక్కలతో సహా ముందుకు కదిలి మాట్లాడిండు. ఎంతో మంది ఆనాడు అవమానించిన్రు కానీ ఏక్కడ అధైర్య పడలేదు" అని ప్రొ.జయశంకర్ గురించి గొప్పగా చెప్పారు.

మన కోసం అమరులైన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకొని చరిత్రను తెలుసుకోవాలన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రం ఒక్క రూపాయు కూడా సహాయం చేయలేదని.. గుజరాత్ కు ఒక్క నీతి.. తెలంగాణ కు ఒక నీతా అని కేంద్రాన్ని నిలదీశారు. ఆర్.టి.సి బిల్ కు ఎవరు అడ్డు పడుతున్నారో అందరికీ తెలుసు అని.. గవర్నర్‌ను ఎవరు ఆడిస్తున్నారో మీకు తెలుసని ఆమె ఎద్దెవా చేశారు.





Updated : 6 Aug 2023 7:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top