Home > తెలంగాణ > మ‌రోసారి కేసీఆర్‎ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి : కవిత

మ‌రోసారి కేసీఆర్‎ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి : కవిత

మ‌రోసారి కేసీఆర్‎ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి : కవిత
X

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మరోసారి పనిచేసే ప్రభుత్వానికి అవకాశమివ్వాలని కోరారు. దమ్మున్న ముఖ్యమంత్రి ధైర్యంగల ప్రకటన అని కవిత ట్వీట్ చేశారు" రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముంది" అని కవిత అన్నారు.

సీఎం కేసీఆర్ విడుదల చేసిన టికెట్లలో కవిత పేరు కనిపించలేదు. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. అభ్యర్థుల లిస్ట్ లో కవిత పేరు లేకపోవడంతో ఆమె మరొకసారి ఎంపీగానే బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.





తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక నర్సాపూర్, జనగాం, గోషామహల్‌, నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు సంబంధించి ప్రకటిస్తామని తెలిపారు. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ సీఎం ఈసారి బరిలోకి దిగనున్నారు. 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేశారు.



Updated : 21 Aug 2023 12:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top