Home > తెలంగాణ > Kavitha Kalvakuntla: 'బాలికల మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి'..

Kavitha Kalvakuntla: 'బాలికల మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి'..

Kavitha Kalvakuntla: బాలికల మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి..
X

భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉదయం పరిశీలించిన సంగతి తెలిసిందే. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కవిత ఆరా తీశారు. వారి బలవన్మరణానికి గల కారణాలను, అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. క‌విత హాస్ట‌ల్‌ను ప‌రిశీలించిన అనంత‌రం ప్ర‌భుత్వం క‌మిటీ వేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా క‌విత ట్వీట్ చేశారు. ఇద్దరు బాలిక‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై త‌మ‌ డిమాండ్‌కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అని క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Updated : 6 Feb 2024 6:05 PM IST
Tags:    
Next Story
Share it
Top