కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించిన కవిత
X
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనారోగ్యంలో బాధపడుతూ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వెంకట్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. తీవ్రత ఎక్కువ కావడంతో మంగళవారం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేరారు. మంత్రికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. దీంతో ఆయన యశోదలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. వారితో కాసేపు మాట్లాడారు. కేసీఆర్, కోమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం కేసీఆర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరామర్శించారు.