Home > తెలంగాణ > MLC Kavitha : ఆ హామీలు నెరవేర్చండి.. భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha : ఆ హామీలు నెరవేర్చండి.. భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha : ఆ హామీలు నెరవేర్చండి.. భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ
X

(MLC Kavitha) బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆమె లేఖ రాశారు. ఈ బడ్జెట్లోనే బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమానికి వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని లేఖలో కవిత ప్రస్తావించారు. ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాలని లేఖలో ఆమె కోరారు. కాగా అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సైతం నిర్వహించారు. ఏప్రిల్ లోపు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు.


Updated : 5 Feb 2024 2:31 PM IST
Tags:    
Next Story
Share it
Top