MLC Kavitha: అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సరైన నిర్ణయం కాదు..
X
సచివాలయం ప్రాంగణం(Secretariat premises)లో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, తెలంగాణ తల్లి(Telangana thalli) తెలంగాణకు అత్యంత ముఖ్యం. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సందర్భంగా వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై స్పందించారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఎమ్మెల్సీ కవిత తన గళాన్ని వినిపించారు. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ. 6377 ఉండగా.. రూ. 4- 5 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సభలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానలి శాశనమండలి చైర్మన్‌ను కోరారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.