Home > తెలంగాణ > Heavy Rains : రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Heavy Rains : రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Heavy Rains : రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో మోస్తరు నుంచి భఆరీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశముందని, దాని ప్రభావంతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా 2, 3, 4వ తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు.

శుక్రవారం రాత్రి నుంచి ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇక శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో చినుకులు లేదా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది.

He

Updated : 1 Sep 2023 3:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top