Home > తెలంగాణ > రాష్ట్రంలో రైల్వేలైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో రైల్వేలైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో రైల్వేలైన్ల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీతో పాటు మరో 9 రాష్ట్రాల్లో 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు - బీబీ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్‌ పనులు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య మొత్తం 502.34 కి.మీ మేర డబ్లింగ్‌ జరగనుంది. నెర్గుండి- బారాంగ్‌; కుర్దా రోడ్‌ - విజయనగరం మధ్య రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో 417.6 కి.మీల మేర మూడో లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.







Updated : 16 Aug 2023 7:19 PM IST
Tags:    
Next Story
Share it
Top