ఆ ఇద్దరినీ దాటేసి చరిత్ర సృష్టించిన షమీ
X
వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి విశ్వరూపం చూపించాడు. మెగా టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ 5 వికెట్లతో చెలరేగాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 5 ఓవర్లు వేసిన షమీ.. కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా.. అందులో ఒకటి మెయిడిన్ కావడం విశేషం.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో షమీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటి వరకు 45 వికెట్లు పడగొట్టిన షమీ.. భారత బౌలింగ్ దిగ్గజాలైన జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్‌లను అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్‌కప్‌లో 44 వికెట్లు పడగొట్టారు.
వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 14 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో షమీకి ఇది మూడో ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.