Home > తెలంగాణ > Moinabad Case Update : మొయినాబాద్ మర్డర్ కేసు.. కీలక పురోగతిని సాధించిన పోలీసులు

Moinabad Case Update : మొయినాబాద్ మర్డర్ కేసు.. కీలక పురోగతిని సాధించిన పోలీసులు

Moinabad Case Update : మొయినాబాద్ మర్డర్ కేసు.. కీలక పురోగతిని సాధించిన పోలీసులు
X

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. యువతిని హత్య చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం నాలుగు రోజులుగా ముమ్మరంగా దర్యాప్తు మొదలుపెట్టారు. తాజాగా యువతి మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్డేట్ కనుగొన్నారు. హత్యకు గురైన యువతిని హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి థైసీన్ గా గుర్తించారు. యువతిని వేరేచోట హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బకారం సమీపంలో యువతిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు.. మొయినాబాద్ తీసుకువచ్చి దహనం చేయాలని చూసినట్లు గుర్తించారు. హత్యకు ముందు యువతి ఆటోలో డ్రీమ్ వ్యాలీకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఆ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సమీపంలోని సీసీ కెమెరాలన్నింటీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాగా, యువతి మృతదేహాం ఉస్మానియా ఆస్పటల్ మార్చురీలో ఉంది.

అంతకుముందు విచారణలో బాధితురాలి ఫోన్‌ దొరికినా సిమ్‌కార్డు తొలగించడంతో మొయినాబాద్‌ చుట్టుపక్కల ఏ పోలీస్‌ స్టేషన్‌లోనూ మిస్సింగ్‌ ఫిర్యాదు రాకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారింది. మొబైల్ ఫోన్ పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు సిమ్ కార్డు ఐఎంఈ నంబర్‌ను గుర్తించడం ప్రారంభించారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ హత్య జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు. యువతి ప్యాంట్ వెనుక జేబులో స్టిక్కర్ కనిపించింది. నిందితులు ఓ దారి నుంచి వచ్చి మరో దారిలో వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Moinabad case update: Charred body of woman identified as Thaiseen hyderabad, Telangana

Moinabad case update, Charred body of woman , identified as Thaiseen , hyderabad, Telangana, Moinabad Inspector, G Pavan Kumar Reddy, Bakaram-Murtuzaguda village road , alerted the field workers, villagers alerted , Moinabad police

Updated : 12 Jan 2024 11:52 AM IST
Tags:    
Next Story
Share it
Top