అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. రూ.2 వేల నుంచి రూ.1 లక్ష వరకు
X
ములుగు జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన పలువురి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. అవి కూడా వేలల్లో, కొందరికైతే లక్షల్లో కూడా క్రెడిట్ అయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ కాలనీకి చెందిన సుమారు 50 మంది అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ అయినట్టు వారికి మెసేజ్ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి మొదలుకొని రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.లక్ష వరకు జమయ్యాయి
బ్యాంకు సిబ్బంది పొరపాటున జమ చేశారని అనుకున్న అందరి అకౌంట్లు వివిధ ఒకే బ్యాంకులో లేవు. కొందరు అకౌంట్లు SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), మరి కొందరి అకౌంట్లు PNB(పంజాబ్ నేషనల్ బ్యాంక్), ఇంకొందరివి APGVBV కాగా.. మరి కొందరికి కెనరా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే శనివారం బ్యాంకులకు సెలవు దినం. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పంపారనేది అర్థం కావడం లేదు. అయితే ఇలా డబ్బులు క్రెడిట్ అయిన మెసేజ్ వచ్చిన వెంటనే పలువురు తమ గూగుల్ పే, ఫోన్ వంటి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల ద్వారా వాటిని వేరే అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. కాగా.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అధికారులకు తెలిసింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు ఆ కాలనీకి చేరుకున్నారు. ఈ విషయంలో విచారణ జరిపారు.