Home > తెలంగాణ > పురుగుల మందుతో మోత్కుపల్లి హల్ చల్.. కేసీఆర్ను నమ్మి..

పురుగుల మందుతో మోత్కుపల్లి హల్ చల్.. కేసీఆర్ను నమ్మి..

పురుగుల మందుతో మోత్కుపల్లి హల్ చల్.. కేసీఆర్ను నమ్మి..
X

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు ట్యాంక్ బండ్పై పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు. దళిత మందు అమలు కాకుంటే గడ్డి మందు తాగి చనిపోతానని అప్పట్లు చెప్పానని.. దళిత బంధుల అమలు కాకపోవడంతో దళితులు తనను నిలదీస్తున్నారని వాపోయారు. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను నమ్మి పొరపాటు చేశానని అన్నారు.

మోసాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని మోత్కుపల్లి విమర్శించారు. దళిత బంధు పథకం తెస్తున్నానని కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తేనే బీఆర్ఎస్లో జాయిన్ అయినట్లు చెప్పారు. దళితులకు మేలు జరుగుతుందని వెళ్తే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ గట్టిగా ఉన్నాడు. ఎలాగూ చావడు. నేనైనా చనిపోతా. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’’ అని మోత్కుపల్లి అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్ నష్టపోయిందని.. కాబట్టి ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. రేవంత్ రెడ్డి అందరి ఇళ్లకు వెళ్తుండు కానీ.. తన ఇంటికి మాత్రం రావడం లేదన్నారు. తనకు తుంగతుర్తి సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమని చెప్పారు.


Updated : 21 Oct 2023 11:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top