ఆకట్టుకునే ఫీచర్లతో మోటో G14..ధర కూడా తక్కువే..
X
మోటరోలా నుంచి తక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సరికొత్త ఫీచర్లతో మోటో G14ను కంపెనీ లాంచ్ చేసింది. 4gb ర్యామ్+128gb స్టోరేజీ గల మొబైల్ ధర 9,999 మాత్రమే. తక్కువ బడ్జెట్లో ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. ఇవాళ లాంచ్ అయిన ఈ మొబైల్ను ఫ్లిప్ కార్ట్, మోటరోలా వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ 750 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్తో ఫోన్ను రూ.9249కే సొంతం చేసుకోవచ్చు.
మోటో G14 మొబైల్ 6.5 ఇంచెస్ HDప్లస్ డిస్ ప్లే సహా 60HZ రిఫ్రెష్రేట్తో వస్తుంది. ఈ ఫోన్ 2GHz క్లాక్ స్పీడ్ ఆక్టా కోర్ Unisoc T616 ప్రాసెసర్ను కలిగివుంది. ఇక ఫొటోల కోసం 50mp కెమెరా, సెల్ఫీల కోసం 2mp ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ మొబైల్ 5000mah బ్యాటరీతో పాటు 20w ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ను కలిగివుంది. ప్రస్తుతం స్టీల్ గ్రే , స్కై బ్లూ కలర్స్లో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని కలర్స్లో మొబైల్ను తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.