Home > తెలంగాణ > MP Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు

MP Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు

MP Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
X

బీఆర్ఎస్ నాయకుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు. ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారన్నారు. రంజిత్ రెడ్డి తీరుపై జనవరి 20న విశ్వేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్.. కోర్టు అనుమతితో ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇక, 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) తరపున చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటి చేసి విజయం సాధించారు. 2018 టీఆర్ఎస్ పార్టీతో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో ఎంపీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీ చేయగా రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి .. 2021లో హస్తం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కమలం పార్టీలో కొనసాగుతున్నారు.




Updated : 24 Jan 2024 6:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top