Home > తెలంగాణ > ప్రధాని మోదీకి రాఖీ కడతా..ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్

ప్రధాని మోదీకి రాఖీ కడతా..ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్

ప్రధాని మోదీకి రాఖీ కడతా..ఎంపీ రేణుకా చౌదరి కామెంట్స్
X

తెలంగాణలో రాజ్యసభ ఎంపీగా ఎకగ్రీవంగా ఎన్నికైన రేణుకా చౌదరి ప్రధాని మోదీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మోదీ మిమ్మల్ని శూర్పణఖ అన్నారు కదా అని ఓ విలేఖరి ప్రశ్నించగా అననివ్వండి మోదీ నా బ్రదరేగా అని ఆమె బదులిచ్చారు. రాబోయే రాఖీ పండుగకు రాఖీ కడతామని అన్నారు. తాను రాజ్య సభ ఎన్నిక కావడం బహుమతి కాదని, భాద్యతని అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ప్రతిపక్ష నేతల ఇళ్లపైకి ఈడీని పంపిస్తున్నారని, పదేళ్లు ఇదే చూశామని ఆరోపించారు. ఇకపై ఇలా సాగనివ్వమని రేణుకా హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రధాని వారిని మోసం చేశారని విమర్శించారు.

ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్‌కు చోటే లేదని, కాంగ్రెస్ నుంచి గెలిచే వారికే సీటు ఇవ్వాలని కోరారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని, కానీ ఖమ్మం సీటు మాత్రం కుదరదని అన్నారు. గాంధీభవన్‌లో చాలా కుర్చీలు ఉంటాయని, అక్కడ నామాకు అవకాశం ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణకు ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 3 నామినేషన్లే దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైనవారికి అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ క్రమంలో రాజ్యసభకు ఎన్నికైనట్లు రేణుకా చౌదరికి అధికారులు ఇవాళ ధ్రువీకరణ పత్రం అందించారు.



Updated : 21 Feb 2024 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top