Home > తెలంగాణ > Uttam Kumar Reddy : 70 సీట్లు పక్కా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే - ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy : 70 సీట్లు పక్కా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే - ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy : 70 సీట్లు పక్కా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే - ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

అక్టోబర్ 6వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయం ఖాయమని అన్నారు. హుజూర్ నగర్లో పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే తొలిమెట్టు అని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చిందని ఉత్తమ్ విమర్శించారు. వాస్తవానికి ఆ బిల్లు సోనియాగాంధీ మానస పుత్రిక అని అందుకే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లను ఈ ఎన్నికల్లోనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్పైనా ఉత్తమ్ ఫైర్ అయ్యారు. కేంద్రంలో పెద్ద మోడీ ఉంటే రాష్ట్రంలో కేసీఆర్ చిన్న మోడీలా తయ్యారయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇండ్లని హేళన చేసిన కేసీఆర్...ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఉత్తమ్ ఆరోపించారు.

హుజూర్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీరుపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదుగానీ.. సైదిరెడ్డి మాత్రం 300 ఎకరాల భూమి సంపాదించిండని ఆరోపించారు. హుజూర్ నగర్లోని ఒక్కో వైన్ షాప్ నిర్వాహకుల నుంచి ఆయన రూ.6లక్షల చొప్పున వసూలు చేశారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తేలేదని ఉత్తమ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. జనంపై తప్పుడు కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్ కండువా కప్పుకునేలా పోలీసులే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసులకు ఎన్నికల తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు.




Updated : 2 Oct 2023 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top