Mp Elections : తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోల బదిలీలు
Krishna | 11 Feb 2024 3:08 PM IST
X
X
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఎంపీడీవోల బదిలీలు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 395 ఎంపీడీవోలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో ఎంపీడీవోలను బదిలీ చేశారు. శనివారం ఎమ్మార్వోలను బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది ఎమ్మార్వోలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది.
అదేవిధంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు. కాగా ఒకే చోట మూడేళ్లు పనిచేసేవారు.. సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బదిలీ చేపట్టింది.
Updated : 11 Feb 2024 3:08 PM IST
Tags: mpdo transfer mpdos transferred telangana mpdos mros transferred mro mpdo transfer telangana officer transfer telangana govt cm revanth reddy mp elections lok sabha elections parliament elections officers transferred due to mp elections telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire