నన్ను గెలిపిస్తే మంత్రిగా తిరిగొస్తా : సీతక్క
X
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నువ్వా నేనా అంటూ పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరి ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచే సీఎం, మంత్రి స్థానాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ములుగులో తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని సీతక్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. తనను కూడా గెలిపిస్తే మంత్రిని అయ్యి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ములుగుకు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమి లేదని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.