మేడారం భక్తుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్.. ఇంటర్ నెట్ లేకపోయినా పనిచేస్తుంది
X
తెలంగాణ కుభమేళా మేడారం జాతరకు వేళయింది. ప్రజల సౌకర్యార్థం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. కాగా ఇప్పటికే రాష్ట్ర నలు మూలల నుంచి ప్రత్యేక బస్సులు, ట్రైన్లు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. హనుమకొండ నుంచి హెలిక్యాప్టర్ సదుపాయం కూడా కలిపించింది. ఈసారీ మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య 2 కోట్లకు దాటొచ్చని అధికారులు తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో ములుగు పోలీస్ డిపార్ట్ మెంట్ భక్తుల భద్రత, సౌలభ్యం కొరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యం కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా జాతరకు వచ్చే భక్తులకు తెలియాల్సిన వివరాలు, ప్రయాణం, ఇతర సూచనలు ఇందులో ఉంటాయి. యాప్ అందరికీ అర్థమయ్యే విధంగా.. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించారు.
వివిధ మార్గాల ద్వారా మేడారానికి వచ్చే భక్తులు ఏయే మార్గాలా ద్వారా జాతరకు రావొచ్చు, ఎంత దూరం ఉంటుంది. ఎక్కడెక్కడ దారి మలుపులు ఉన్నాయి, పార్కింగ్ స్థలాలు ఇలాంటి సమాచారం ఈ యాప్ లో ఉంటుంది. ఈ యాప్ ను ఒక్కసారి ఇన్ స్టాల్ చేస్తే ఇంటర్ నెట్ లేకపోయినా వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి Guide to Medaram by MulugPolice అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ లింక్ https://play.google.com/store/apps/details?id=com.medaram.police క్లిక్ చేసినా.. డైరెక్ట్ డౌన్ లోడ్ ఆప్షన్ కు వెళ్తుంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.