ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
X
ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. మూసి నదిపై ముసారాంబాగ్ వద్ద నూతన ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నందన ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొత్త ఫ్లై ఓవర్‌ను అలీ కేఫ్ చౌరస్తా నుంచి పిస్తా హౌజ్ వరకు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంబర్‌పేట్ నుంచి మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందా తిలిస్మాత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్, హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్ నగర్ వైపు మళ్లిస్తున్నారు.
మలక్‌పేట నుంచి అంబర్‌పేట వైపు వచ్చే వాహనాలను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి అఫ్జల్ నగర్, గోల్నాక న్యూబ్రిడ్జి, జిందా తిలిస్మాత్, అలీ కేఫ్ ఎక్స్ రోడ్డు నుంచి అంబర్‌పేట జంక్షన్ వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తమకు సహకరించి.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.