ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు అరెస్ట్
X
హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. ఓటర్లు ఒకరొకరే బూత్‌లకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల అక్రమాలకు కూడా చెక్ పెడుతున్నారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ కొడుకు జయసింహను అరెస్ట్ చేశారు. జయసింహ తన తండ్రికి ఓటు వేయాలంటూ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు.
పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రం రెడ్డిపైనా చర్యలు తీసుకున్నారు. విక్రం రెడ్డి తనను కొట్టాడని లక్కదొడ్డికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై 1950 నంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. cVigil అనే మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని, ఫిర్యాదు అందిని అరగంటలో చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.