Home > తెలంగాణ > Musi River Hyderabad:మూసీ ఉగ్రరూపం.. బ్రిడ్జిని తాకిన వరద ప్రవాహం

Musi River Hyderabad:మూసీ ఉగ్రరూపం.. బ్రిడ్జిని తాకిన వరద ప్రవాహం

Musi River Hyderabad:మూసీ ఉగ్రరూపం.. బ్రిడ్జిని తాకిన వరద ప్రవాహం
X

గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో... అంబర్‌పేట్‌ - దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వేళ్లే ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద ముసారాంబాగ్‌ బ్రిడ్జిని తాకుతోంది. ఇప్పటికే పోలీసులు, సిబ్బంది మూవీ పరివాహక ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్న వంతెన సమీపంలో నీరు పెరుగుతుండటంతో మలక్‌పేట వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. పోలీసులు, GHMC అధికారులు ఎలాంటి విపత్తు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాలా కాలనీల్లో వరద నీరు ఇళ్లను ముంచెత్తే అవకాశం ఉందని అంటున్నారు.





వికారాబాద్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ (గండిపేట చెరువు) వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదలుతున్నారు. దీంతో మూసీ నదిలోకి వరద ప్రవాహం పోటెత్తింది. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో ప్రమాదరకరంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్‌ వంతెన మూసివేసే అవకాశముంది. ఈ ఉదయం ఆఫీసులు, ఇతర పనుల కోసం వెళ్లే వారు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అంబర్‌పేట కొత్త బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మరికొన్ని చోట్ల ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.








Updated : 7 Sept 2023 12:03 PM IST
Tags:    
Next Story
Share it
Top