Home > తెలంగాణ > నా తండ్రి కబ్జా చేసినందుకు క్షమించండి..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు

నా తండ్రి కబ్జా చేసినందుకు క్షమించండి..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు

నా తండ్రి కబ్జా చేసినందుకు క్షమించండి..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు
X

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో షాక్ తగిలింది. ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్న సమయంలో... తాజాగా ఆయన కూతురు తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఆసక్తికరంగా మారింది. చెరువు భూమిని తన తండ్రి కబ్జా చేశారని ఆరోపణలు చేస్తోన్న తుల్జా భవాని తాజాగా.. తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను మరికొందరితో కలిసి కూల్చివేశారు.

‘‘నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మున్సిపాలిటికీ, హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ చేయుచున్నాను’’ అని తుల్జా భవానీ రెడ్డి ఓ నోటీసును కూడా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా తుల్జా భవానీ రెడ్డి మాట్లాడుతూ.. మత్తడి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పారు. తప్పు జరిగిందని.. దానిని తాను కరెక్ట్ చేసుకుంటున్నానని తెలిపారు. ఆ భూమిని తిరిగి తాను చేర్యాల మున్సిపాలిటికే రాసిస్తున్నానని ప్రకటించారు. డాక్యూమెంట్ కూడా రెడీగా ఉందని.. ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు ద్వారా దానిని రెడీ చేసి కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 70 ఏండ్ల వ్యక్తి .. ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదన్నారు. తన తండ్రి ఎమ్మెల్యే కాకముందే.. బాగా సంపాదించారని.. వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, నెలకు కోటిన్నర రెంట్ వస్తుందని అన్నారు. అలాంటి వ్యక్తి.. ఇలాంటి భూమి తీసుకుని ఉండకూదని చెప్పారు. తప్పు జరిగింది, క్షమించండి తిరిగి ఇచ్చేస్తానని భవాని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవాని రెడ్డి ప్రకటించడంతో చేర్యాల పాత బస్టాండ్ వద్ద అఖిలపక్ష నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.





Updated : 25 Jun 2023 1:28 PM IST
Tags:    
Next Story
Share it
Top