Home > తెలంగాణ > కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ భయపడ.. మైనంపల్లి ఆడియో వైరల్..

కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ భయపడ.. మైనంపల్లి ఆడియో వైరల్..

కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ భయపడ.. మైనంపల్లి ఆడియో వైరల్..
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే మంత్రి హరీష్ రావుపై కాంట్రవర్శియల్ కామెంట్లు చేసిన ఆయన నేతలపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి బూతుపురాణానికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఆడియోలో మైనంపల్లి తాను ఎవరికీ భయపడనని అన్నారు. సీఎం, కేటీఆర్, పీఎం తన జోలికి ఎవరూ రారని, ఎవరికీ తాను భయపడనని చెప్పారు. ఆడియోలో సాయి పేరు ప్రస్తావించిన ఆయన.. తాను తల్చుకుంటే సాయంత్రంలోపు మర్డర్ చేస్తారని, తన నియోజకవర్గంలో ఉన్నందుకు బతికిపోయాడని అన్నారు. రేవంత్ రెడ్డిపైనా మైనంపల్లి నోరు పారేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను తొక్కుతానంటూ వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. సీఎం అన్న కొడుకును చంపేస్తానని చెప్పానని కేటీఆర్ దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావించినట్లు మైనంపల్లి చెప్పారు. కవిత మా ఫ్యామిలీయే అని చెప్పడంతో వెనక్కి తగ్గానని అన్నారు.





తెలంగాణ ఉద్యమ సమయంలో తాను సమైక్యాంధ్రకు మద్దతిచ్చానని మైనంపల్లి చెప్పినట్లు ఆడియోలో స్పష్టంగా ఉంది. ఆంధ్రోళ్లకు ఔట్ రైట్ మద్దతిచ్చానని చెప్పారు. బాల్క సుమన్ను హైదరాబాద్ రానియ్య బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.





Updated : 26 Aug 2023 10:14 AM IST
Tags:    
Next Story
Share it
Top