Mynampally Hanumanth Rao : ఢిల్లీకి మైనంపల్లి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..!
X
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మల్కాజ్గిరి టికెట్‌తో పాటు తన కొడుకు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. కానీ రోహిత్‌కు గులాబీ బాస్ షాకిచ్చారు. మెదక్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఇచ్చారు.
ఈ క్రమంలో మైనంపల్లి హన్మంతరావు తన కొడుకుతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశమవుతారని సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో కాంగ్రెస్ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కుత్భుల్లాపూర్ నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి రోహిత్ పోటీ చేసేందుకు ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.