Breaking News: బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా
X
మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంత రావు పార్టీకి రాజీనామా చేశారు. కొడుకుకు టికెట్ దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మల్కాజ్గిరి టికెట్ తో పాటు తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్ఠానం ఆయన కుమారుడు రోహిత్కు మొండిచేయి చూపింది.
నిజానికి మెదక్ టికెట్ తన కొడుకు రోహిత్ కు దక్కుతుందని మైనంపల్లి ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే రోహిత్ సైతం కొంతకాలంగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే పద్మా దేవేందర్ రెడ్డిని మెదక్ నుంచి బరిలో దింపుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మైనంపల్లి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ హైకమాండ్ పై ఆయన ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టారు. మంత్రి హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.