Mynampally Hanumanth Rao: మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి
X
మంత్రి మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిపరుడైన ఆయన.. రూ.100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడని అన్నారు. మల్లారెడ్డికి చెందిన కాలేజీలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని విమర్శించారు. మంత్రి అయినప్పటికీ ఇంగితం లేకుండా గల్లీ లీడర్ లా తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఆయన మంత్రి మల్లారెడ్డి కాదు కబ్జాల మల్లారెడ్డి అని అన్నారు.
అభద్రతా భావంతోనే మల్లారెడ్డి వ్యక్తిగత సిబ్బందితో పాటు పోలీసు అధికారులను మార్చాడని మైనంపల్లి విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకుని నోట్ల కట్టలతో ఓట్లు కొనాలని చూస్తున్న ఆయనకు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ కు కాలం చెల్లిందన్న మైనంపల్లి మల్కాజ్ గిరిలో లక్ష ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్ల కోసం పథకాలు తెచ్చిన బీఆర్ఎస్ పతనం ఖాయమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసుల అవినీతి చిట్టాను సైతం బయటపెడతామని హెచ్చరించారు
ఐదేండ్లులో కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనదేనని మైనంపల్లి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పతనమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.