Home > తెలంగాణ > 'తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నన్ను క్షమించండి'.. నాగం

'తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నన్ను క్షమించండి'.. నాగం

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నన్ను క్షమించండి.. నాగం
X

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, చివరకు రాష్ట్రాన్ని ఓ దోపిడీ దొంగల ముఠాకు అప్పగించినందుకు ప్రజలు తనను క్షమించాలని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరు నిధులు నియామకాలే లక్ష్యంగా ఉద్యమంలో పాల్గొన్నానని.. సాధించి తెచ్చుకున్న స్వరాష్ట్రంలోకేసీఆర్ దోపిడీ దొంగల ముఠా కారణంగా సర్వం కోల్పోతున్నామని అన్నారు. శనివారం వారి స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల త్యాగాలను పక్కనపెట్టి ఉద్యమ ముసుగులో గద్దెనెక్కిన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి రాజ భోగాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ నీటిని రాయలసీమకు పంపి రతనాలసీమ గా మార్చేందుకు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

శ్రీశైలం గేట్లు ఎత్తక ముందే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రభుత్వం తన్నుకు పోతున్నా ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని పైగా పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయని సంబరాలు జరుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం తాను ఎప్పుడు వ్యతిరేకం కాదని కేవలం అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలపైనే పోరాడినట్లు స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి లిఫ్టుకు అతి చేరువలో పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నిర్మాణం చేయకూడదని నిపుణుల కమిటీ స్పష్టం చేసినప్పటికీ పెడచెవిన పెట్టిన దాని ఫలితంగానే కల్వకుర్తి మొదటి ఫిఫ్త్ పంపులు ధ్వంసం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ అమరుల ఆశయాలు నెరవేరక పోవడంపై కొన్ని సందర్భాల్లో తనకు రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 13 Aug 2023 8:12 AM IST
Tags:    
Next Story
Share it
Top