Pothuganti Ramulu : బీఆర్ఎస్కు మరో ఎంపీ షాక్.. బీజేపీలో చేరిక..!
X
బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ రాములు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తన కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్లారు. గురువారం బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకునే అవకాశం ఉంది. గత కొన్నాళ్ల నుంచి ఆయన బీఆర్ఎస్తో అంటిముట్టనట్లు ఉంటున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినా.. ఆ పార్టీలో ఎంపీ టికెట్ కోసం పోటీ ఎక్కువ ఉండంతో బీజేపీలో చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
నాగరకర్నూల్ నుంచి బీజేపీ తరుపున ఆయన కొడుకు భరత్ను ఎన్నికల బరిలోకి దింపాలని రాములు భావిస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా రాములు చేరికను ధృవీకరిస్తున్నారు. కాగా నాగర్ కర్నూల్ టికెట్ను కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, మల్లు రవి ఆశిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ఇప్పటికే మల్లు రవి ప్రకటించారు. అటు ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే దానిని సీఎం రేవంత్ ఇంకా ఆమోదించలేదు. కానీ నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తానని రేవంత్ భరోసా ఇచ్చారని మల్లు చెబుతున్నారు.